TS NEWS: సామాజిక వైద్యుల వినతిని పరిగణనలోకి తీసుకోండి: హైకోర్టు - ts high court hearing on rmp association petition
close
Published : 24/07/2021 16:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS NEWS: సామాజిక వైద్యుల వినతిని పరిగణనలోకి తీసుకోండి: హైకోర్టు

హైదరాబాద్‌: సామాజిక వైద్యుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.  2015లో జారీ అయిన జీవో  ప్రకారం... తమకు శిక్షణ ఇవ్వాలని కోరుతూ ఆర్‌ఎంపీ, పీఎంపీలు గత నెల 5న వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు. కానీ, వైద్యారోగ్యశాఖ అధికారులు స్పందించడం లేదని ఆర్‌ఎంపీ, పీఎంపీల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకన్న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. పారామెడిక్స్‌ శిక్షణ ఇవ్వాలన్న సామాజిక వైద్యుల వినతిని పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. చట్టానికి అనుగుణంగా వీలైనంత తర్వరగా వినతిపత్రాన్ని పరిగణించాలని సూచిస్తూ హైకోర్టు విచారణ ముగించింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని