రేపు టీఎస్‌ ఇంటర్‌ రీ-వెరిఫికేషన్‌ ఫలితాలు - ts inter re verification results will release tomorrow
close
Updated : 28/07/2020 18:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రేపు టీఎస్‌ ఇంటర్‌ రీ-వెరిఫికేషన్‌ ఫలితాలు

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్షల రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటన విడుదల చేసింది. రేపటి నుంచి ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ http//tsbie.cgg.gov.in ద్వారా సవరించిన మార్కులు, స్కాన్‌ చేసిన జవాబు స్క్రిప్టులు డౌన్‌లోడ్‌ చేసుకోచ్చని తెలిపింది. మొత్తం 37,387 మంది విద్యార్థులు 72,496 సబ్జెక్టుల్లో రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. అయితే ఇప్పటి వరకు 71,298 జవాబు స్క్రిప్టులే తిరిగి ధ్రువీకరించామని, మిగతా 1,198 జవాబు స్క్రిప్టులు నెలాఖరుకి పూర్తవుతాయని తెలిపింది. సవరించిన మెమోలను ఆగస్టు 1 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ప్రకటనలో ఇంటర్‌బోర్డు సూచించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని