‘హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రే’ - ttd announcement on hanuman birth place
close
Updated : 21/04/2021 12:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రే’

అధికారికంగా ప్రకటించిన తితిదే

తిరుమల: హనుమంతుడి జన్మస్థానంపై తితిదే అధికారిక ప్రకటన చేసింది. సప్తగిరుల్లోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థానమని తెలిపింది. అంజనాద్రిలోని జాపాలీ తీర్థంలో హనుమంతుడు జన్మించినట్లు వెల్లడించింది. ఈ మేరకు తిరుమలలోని నాదనీరాజనం వేదికగా జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీధర శర్మ ప్రకటించారు. ఆంజనేయుడి జన్మస్థానంపై అన్వేషణకు తితిదే కమిటీని ఏర్పాటు చేసింది. క‌మిటీలోని పండితులు ప‌లుమార్లు స‌మావేశమై లోతుగా ప‌రిశోధ‌న చేసి హ‌నుమంతుడు అంజ‌నాద్రిలోనే జ‌న్మించాడ‌ని రుజువు చేసేందుకు బ‌ల‌మైన ఆధారాలను సేక‌రించారు. హనుమ జన్మస్థలంపై నాలుగు నెలల పాటు తమ కమిటీ అన్వేషణ కొనసాగిందని ఆచార్య మురళీధర శర్మ చెప్పారు. అన్వేషణకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.

‘‘హనుమ జన్మస్థానంపై సంకల్పం తీసుకున్నాం. శాసన, భౌగోళిక, పౌరాణిక, వాజ్ఞ్మయ ప్రమాణాలతో ఆధారాలు సేకరించాం. వేంకటాచల మహత్యాన్ని పౌరాణిక ఆధారంగా తీసుకున్నాం. వేంకటాచలానికి అంజనాద్రితో పాటు 20 పేర్లు ఉన్నాయి. త్రేతాయుగంలో దీన్ని అంజనాద్రిగా పిలిచారు. అంజనాదేవికి తపోఫలంగా హనుమంతుడు జన్మించాడు. సూర్యబింబం కోసం వేంకటగిరి నుంచే హనుమ ఎగిరాడు. 12 పురాణాలు ఆంజనేయుడు తిరుమల కొండల్లోనే పుట్టాడని చెబుతున్నాయి. జాపాలీ తీర్థమే ఆయన జన్మస్థలంగా ప్రకటిస్తున్నాం. హంపీ విజయనగరం అంజనాద్రి కాదు. వాలి ఏలిన కిష్కింద కాబట్టి వానర సైన్యం ఆనవాళ్లు ఉండొచ్చు. నాసిక్‌, జార్ఖండ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర.. ఇవేవీ అంజనాద్రి కావు. ఛత్తీస్‌గఢ్‌, నాసిక్‌ పరిశోధకులు సహా అందరికీ దీన్ని స్పష్టం చేస్తున్నాం. 12, 13 శతాబ్దం నాటి ఎన్నో రచనల్లో అంజనాద్రి ప్రస్తావన ఉంది. అన్నమయ్య కీర్తనల్లో వేంకటాచలాన్ని అంజనాద్రిగా వర్ణించారు’’ అని మురళీధర శర్మ వెల్లడించారు.

హనుమ జన్మస్థానంపై అన్వేషణకు ఏర్పాటు చేసిన కమిటీలో మురళీధర శర్మతో పాటు ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుదర్శ‌న‌ శ‌ర్మ‌, ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, ఆచార్య జాన‌మ‌ద్ది రామ‌కృష్ణ‌, ఆచార్య శంక‌ర‌నారాయ‌ణ‌, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావ‌స్తు శాఖ డిప్యూటీ డైరెక్ట‌ర్ విజ‌య్‌కుమార్ స‌భ్యులుగా ఉన్నారు. తితిదే ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా.ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ క‌న్వీన‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు.

 

 Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని