close
Published : 10/02/2021 22:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శుభవార్త వినిపించిన ‘జగదీష్’

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: వైవిధ్యభరిత కథలు ఎంపిక చేసుకునే నాని నుంచి రాబోతున్న తాజా చిత్రం ‘టక్‌ జగదీష్‌’. శివ నిర్వాణ దర్శకుడు. ఐశ్వర్య రాజేష్‌, రీతూవర్మ కథానాయికలు. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో మంచి కుటుంబ కథా చిత్రంగా రూపొందుతుంది.  ఆసక్తికర ఈ ప్రాజెక్టు నుంచి ఎప్పుడెప్పుడు అప్‌డేట్‌ వస్తుందా? అని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త వినిపించాడీ జగదీష్‌. ఈ చిత్రంలోని తొలిపాటకు సంబంధించిన లిరికల్‌ వీడియోను ఫిబ్రవరి 13న ఉదయం 9గంటలకు విడుదల చేస్తున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు దర్శకనిర్మాతలు.  ‘ఇంకోసారి ఇంకోసారి’ అంటూ ఈ గీతాన్ని నాని, రీతూ వర్మపై చిత్రీకరించినట్టు తెలుస్తోంది పోస్టర్‌ బట్టి చూస్తుంటే. ‘13కి విందాం.. 14కి రిపీటేసేయ్‌’ అని నాని చేసిన ట్వీట్‌ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. షైన్‌ స్ర్కీన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ‘నిన్నుకోరి’ వంటి క్లాసిక్‌ హిట్‌ తర్వాత నాని-శివ నిర్వాణ కలయికలో వస్తోన్న సినిమా ఇది. ఏప్రిల్‌ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్రబృందం గతంలో ప్రకటించినప్పటికీ నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ అదే రోజున విడుదలకానుండటంతో ఏప్రిల్‌ 23కి వాయిదా పడే అవకాశాలున్నాయని సినీ వర్గాల సమాచారం.

ఇదీ చదవండి..

లావణ్య-సందీప్‌ సాంగ్‌ చూశారా!

 


1359376741257539585

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని