close
Published : 13/03/2021 13:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘టక్‌ జగదీష్’ నుంచి ‘కోలో కోలన్న కోలో..’

హైదరాబాద్‌:  నాని ప్రధానపాత్రలో శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్‌ జగదీష్‌’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘కోలో కోలన్న కోలో..’ అంటూ టక్‌ జగదీష్‌ తన కుటుంబంతో అనురాగ గీతం పాడుకుంటున్నాడు. పల్లెటూళ్లో ముచ్చటగా జరిగే ఊరి జాతరలో చిందులేస్తున్నాడు. మరి టక్‌ జగదీష్‌ అలియాస్‌ నేచురల్‌ స్టార్‌ నాని కుటుంబ అప్యాయతలను చూడాలంటే ప్రస్తుతం విడుదలైన సాంగ్‌ లిరికల్‌ వీడియోను చూడాల్సిందే.

భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్‌, రీతూ వర్మ కథానాయికలుగా నటిస్తున్నారు. ఉమ్మడి కుటుంబం అనురాగ మమతలను చాటుతూ సాగే ‘కోలో కోలన్న కోలో..’గీతానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించగా.. అమ్రాన్‌ మాలిక్‌, హరిణి ఇవ్వటూరి తమ గాత్రాన్ని అందించారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు. షైన్‌స్క్రీన్‌ పతాకంపై హరీష్‌పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 23 నుంచి ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. మరోవైపు నాని ‘శ్యామసింగరాయ్‌’ ‘అంటే సుందరానికి’ అనే వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని