58కి చేరిన యూకే కరోనా కేసులు - twenty fresh cases of mutant covid strain in india
close
Published : 05/01/2021 12:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

58కి చేరిన యూకే కరోనా కేసులు

ఒకే రోజు 20 మందికి వైరస్ పాజిటివ్ 

దిల్లీ: దేశంలో కొత్త రకం కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మంగళవారం నాటికి ఆ కేసులు సంఖ్య 58కి చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒక్కరోజే 20 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలడంతో కేసుల సంఖ్య 38 నుంచి 58కి చేరింది. బాధితులంతా ఆయా రాష్ట్రాల్లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, ఇప్పటివరకు యూకే నుంచి తిరిగి వచ్చిన వారిలో లేక వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌లో మాత్రమే కొత్త రకం కరోనా పాజిటివ్‌గా తేలింది. 

ఇటీవల యూకేలో కొత్త రకం కరోనా కేసులు వెలుగుచూసినప్పటి నుంచి భారత ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఆ దేశం నుంచి విమాన సర్వీసులను రద్దు చేసింది. అక్కడి నుంచి వచ్చిన ప్రయాణికులను గుర్తించి పరీక్షలు నిర్వహిస్తోంది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తుల తోటి ప్రయాణికులు, కుటుంబ సభ్యులను గుర్తించి వారికి పరీక్షలు జరుపుతున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 

ఇవీ చదవండి:

రెండో రోజు..భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు

‘హెర్డ్ ఇమ్యూనిటీ’ వల్లే తీవ్రత తగ్గిందా..?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని