‘‘మహిళలే ఎందుకు ఇంటి పనులు చేయాలి?’’ - twinkle said household chores should share according to skills
close
Published : 19/07/2020 16:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘‘మహిళలే ఎందుకు ఇంటి పనులు చేయాలి?’’

ట్వింకిల్‌ ఖన్నా

ముంబయి: బాధ్యతలను లింగభేదంతో పంచుకోకూడదని అంటున్నారు బాలీవుడ్‌ నటి ట్వింకిల్‌ ఖన్నా. బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె సినిమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. రచయితగా మారి పలు పుస్తకాలను రాశారు. తాజాగా ఐఏఎన్‌ఎస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మహిళలు మాత్రమే ఇంటి పనులు చేయాలని ఎందుకు ఆశిస్తున్నారని ప్రశ్నించారు. ఇంటి పనుల్లో లింగభేదం చూడొద్దని అభిప్రాయపడ్డారు.

‘‘బాధ్యతలను మహిళలు.. పురుషులు సమానంగా పంచుకోవాలి. వారి నైపుణ్యాలను బట్టి పనులు చక్కదిద్దుకోవాలి. నన్ను వంటింట్లోకి వెళ్లి వంట చేయమంటే నాకు బాధేస్తుంది. చాలా ఒత్తిడికి గురవుతాను. అదే మా ఆయన(అక్షయ్‌కుమార్‌), పిల్లలు బాగా వంట చేస్తారు. వండటాన్ని ఎంజాయ్‌ చేస్తారు. సంగీతం వింటూ రుచికరమైన వంటకాలు చేసిపెడతారు. నాకు వంట చేయాలంటే భయం. కానీ వస్తువులను చక్కగా సర్దిపెట్టడాన్ని ఇష్టపడతా. కొనుక్కొచ్చిన కిరాణా సామగ్రి, ఇతర వస్తువులను ఇంట్లో చక్కగా సర్దిపెడతా. అందుకే ప్రతి ఒక్కరు ఇంట్లో పనుల్ని వారి వారి నైపుణ్యాల్ని బట్టి విభజించి చేసుకోవాలి’’అని ట్వింకిల్‌ ఖన్నా తెలిపారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని