వారణాసిలో కుప్పకూలిన భవంతి.. ప్రధాని ఫోన్‌ - two story buildng collapsed pm responded on incident
close
Published : 01/06/2021 21:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారణాసిలో కుప్పకూలిన భవంతి.. ప్రధాని ఫోన్‌

దిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలోని కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌లో నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల భవనం మంగళవారం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ కౌశల్‌ రాజ్‌ శర్మతో ఫోన్‌ చేసి ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలిపారని, అవసరమైన సహాయం చేస్తానని హామీ ఇచ్చారని ట్విటర్‌ ద్వారా కలెక్టర్‌ వెల్లడించారు. వారణాసి ఆలయ సీఈవో ఈ ఘటనపై స్పందిస్తూ మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున, గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని