వకీల్‌సాబ్‌.. ఒడిశాలో రెండు థియేటర్ల సీజ్‌! - two theatres sealed in odisha gajapathi district for violation of covid rules
close
Updated : 12/04/2021 15:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వకీల్‌సాబ్‌.. ఒడిశాలో రెండు థియేటర్ల సీజ్‌!

భువనేశ్వర్‌: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌‌ నటించిన ‘వకీల్‌ సాబ్‌’ చూసేందుకు ఒడిశాలో ఆయన అభిమానులు భారీగా స్థానిక థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో కొవిడ్‌ నిబంధనలు పాటించని రెండు సినిమా థియేటర్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గజపతి జిల్లా పర్లాఖిముడిలో రెండు థియేటర్లలో ‘వకీల్ ‌సాబ్’‌ విడుదలైంది. దీంతో సినిమాను చూసేందుకు ఆదివారం పవన్‌ అభిమానులు అత్యధిక సంఖ్యలో సినిమా హాళ్ల వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో సినిమా హాళ్ల యాజమాన్యాలు కొవిడ్‌ నిబంధనల్ని పట్టించుకోకుండా వ్యవహరించాయని ఆరోపిస్తూ పర్లాఖిముడిలోని థియేటర్లపై జిల్లా అధికారులు చర్యలకు దిగారు. నిబంధనలు పాటించని రెండు సినిమా హాళ్లకు తాత్కాలికంగా సీల్‌ వేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసిన కొవిడ్‌ నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని