సుధీర్‌-రష్మి ‘అతడు’లో ఆ సన్నివేశం చేస్తే - ugadi jathirathnalu etv ugadi special event 2021
close
Updated : 09/04/2021 16:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుధీర్‌-రష్మి ‘అతడు’లో ఆ సన్నివేశం చేస్తే

హైదరాబాద్‌: సుధీర్‌-రష్మి మరోసారి సందడి చేయబోతున్నారు. వీరిద్దరే కాదు. జబర్దస్త్‌ టీమ్‌ మొత్తం అలరించేందుకు సిద్ధమైంది. ప్రతి పండగకు ప్రత్యేక కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న టెలివిజన్‌ ఛానల్‌ ఈటీవీ. ఈసారి తెలుగు సంవత్సరాది సందర్భంగా ‘ఉగాది జాతిరత్నాలు’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. దీనికి యువ కథానాయకుడు నాని, రీతూ వర్మ విచ్చేశారు.

ఈ సందర్భంగా జబర్దస్త్‌ టీమ్‌ చేసిన సందడి నవ్వులు పంచుతోంది. మంగ్లీ ఆలపించిన గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, రాజ్యాంగా నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌కు నివాళి అర్పిస్తూ, ఆయన పాత్రలో గాయకుడు మనో పలికించిన హావభావాలు మెప్పిస్తున్నాయి. ఈ ఆసక్తికర కార్యక్రమాన్ని వీక్షించాలంటే ఉగాది వరకూ వేచి చూడాల్సిందే!Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని