నాకేమైనా నయనతార కావాలా: పోసాని - ugadi jathiratnalu
close
Published : 05/04/2021 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాకేమైనా నయనతార కావాలా: పోసాని

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మాకు న్యాయం కావాలి సర్‌! అని అడగ్గా.. అరే నాకేమైనా నయనతార కావాలా’ అంటూ నవ్వులు పూయిస్తున్నారు ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి. ఈ టీవీలో ప్రసారం కానున్న ‘ఉగాది జాతిరత్నాలు’ కార్యక్రమానికి విచ్చేసి సందడి చేశారాయన. ఈ షోలో హాస్యనటులు‌, వ్యాఖ్యాతలు‌, సోషల్‌ మీడియా స్టార్లు‌, డ్యాన్సర్లు‌, గాయకులు‌, సినిమా ఆర్టిస్టులు.. ఇలా ఆరు జట్టులు ఉగాది సందడిని చూపించేందుకు సిద్ధమయ్యాయి. షడ్రుచుల్లో ఎవరికి ఏది కావాలో తేల్చుకునే ప్రక్రియలో ఈ జట్ల మధ్య గొడవ మొదలవుతుంది. దానికి తీర్పు చెప్పేందుకే పోసాని కదిలొచ్చారు. పూర్ణ, సంగీత, ఉదయ భాను, మనో న్యాయ నిర్ణేతలుగా వ్యవహించారు. శ్రీ ముఖి, ఆది, టిక్‌ టాక్‌ దుర్గారావు.. ఇలా ఒక్కొక్కరు తమ అభిప్రాయం వ్యక్తం చేసినపుడు పోసాని ఇచ్చే సమాధానం కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ సరదాకి కథానాయకుడు నాని తోడై మరింత వినోదం పంచారు. ‘టక్‌ జగదీష్‌’ విడుదల కాబోతున్న నేపథ్యంలో నాని, రీతూ వర్మ ఈ కార్యక్రమంలో అతిథులుగా మెరిశారు. నానితో సుడిగాలి సుధీర్‌, రాం ప్రసాద్‌ చేసిన హంగామా అంతా చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ ఉగాది రోజున (ఏప్రిల్‌ 13) ఉదయం 9:00 గం.లకు ప్రసారం కానుంది. అప్పటి వరకు ప్రోమోని చూస్తూ ఆనందించండి..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని