భారత్‌ కోసం.. యూకే అథ్లెట్‌ పరుగు - uk athlete fundrising by running 10km per day
close
Published : 31/05/2021 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌ కోసం.. యూకే అథ్లెట్‌ పరుగు


(ఫొటో: జస్ట్‌గివింగ్‌.కామ్‌)

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా రెండోదశలో భారత్‌ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. కరోనా బారిన పడిన దేశ ప్రజలు శ్వాస సంబంధిత సమస్యలతో సతమతవుతున్నారు. అలాంటి వారికి కృత్రిమంగా ఆక్సిజన్‌ అందిస్తేనే ప్రాణాలు నిలుస్తున్నాయి. కానీ, ఆక్సిజన్‌ కొరత వల్ల ఎంతో మంది మృతి చెందుతున్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఒకవైపు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలు, మనసున్న వ్యక్తులు తమవంతు సాయం చేస్తున్నారు. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, సిలిండర్లను, నగదును విరాళంగా ఇస్తున్నారు. విదేశీ ప్రభుత్వాలు కూడా భారత్‌కు కొవిడ్‌ చికిత్సకు కావాల్సిన వాటిని అందజేస్తున్నాయి. భారతదేశ పరిస్థితి చూసి యూకెకి చెందిన అథ్లెట్‌ రామ గుడిమెట్ల కూడా చలించిపోయాడు. భారత్‌కు ఆక్సిజన్‌ అందించడం కోసం తనవంతుగా రోజుకు 10కి.మీ పరుగు తీస్తూ విరాళాలు సేకరిస్తున్నాడు.

ది బ్రిటీష్‌ ఏషియన్‌ ట్రస్ట్‌ అనే స్వచ్ఛంద సంస్థ కరోనాను ఎదుర్కొంటున్న భారత్‌కు సహాయం అందిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్‌ వసతి లేని ఆస్పత్రులకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోంది. భారత్‌కు సాయం చేస్తోన్న ఈ స్వచ్ఛంద సంస్థకు ఆర్థిక సాయం చేయడానికి రామ గుడిమెట్ల ఫిబ్రవరి 24నే ఫండ్‌రైజ్‌ ప్రారంభించాడు. మొదట వారం రోజులపాటు రోజుకు 10కి.మీ పరుగు పెడదామనుకున్నాడు. ఆ తర్వాత అది 30, 50 రోజులు దాటి వంద రోజులు, వెయ్యి పౌండ్ల విరాళమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు. ఇప్పటికి 95 రోజులు పూర్తి కాగా.. 820 పౌండ్లు విరాళంగా సేకరించగలిగాడు. ‘‘ఇప్పటికీ భారత్‌కు సహాయం అవసరం. ఏదైనా మార్పు మనం చేయగలం అంటే.. అది వీలైనన్నీ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయగలగడమే’’ అని రామ గుడిమెట్ల చెప్పుకొచ్చారు. భారత్‌కు సాయం చేయడం కోసం రామ గుడిమెట్ల చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాన్ని అభినందించాల్సిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని