యూకేలో మరోసారి లాక్‌డౌన్‌ - uk govt imposed a fresh lockdown
close
Updated : 20/12/2020 10:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూకేలో మరోసారి లాక్‌డౌన్‌

లండన్‌: యూకేలో మరోసారి లాక్‌డౌన్‌ విధించారు. కొత్తరకం కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో  దాన్ని అరికట్టడానికి లండన్‌ సహా దక్షిణ ఇంగ్లాండ్‌లో లాక్‌డౌన్‌ విధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఈ లాక్‌డౌన్‌ అమల్లోకి వస్తుందని ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు. కొత్తరకం కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తోందని యూకే ప్రధాన వైద్యాధికారి తెలిపారు. ఈ వైరస్‌ 70 శాతం ఎక్కువ వేగంగా ఇది వ్యాప్తి చెందుతోందన్నారు. బుధవారం నుంచి నమోదైన కేసుల్లో 60 శాతం కంటే ఎక్కువే కొత్తరకం వైరస్‌ను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కొత్తరకం వైరస్‌ను వాక్సిన్‌ నిరోధిస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవని ఆయన తెలిపారు. మరోవైపు క్రిస్మస్‌పై ఈ లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావం చూపనుంది. తాజా నిషేధం వల్ల యూకేలో చాలా కుటుంబాలు క్రిస్మస్‌కు కలుసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈసారి క్రిస్మస్‌ను ఒక ప్రణాళిక ప్రకారం నిర్వహించుకోలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పేర్కొన్నారు. 

 

ఇటలీలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతుండడంతో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించారు. క్రిస్మస్‌ నేపథ్యంలో ప్రజలు బహిరంగంగా గుమిగూడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఇటలీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 24 నుంచి జనవరి 6 వరకు ఇటలీలో రెడ్‌జోన్‌ ప్రకటించారు. ఈ లాక్‌డౌన్‌ రోజుల్లో అత్యవసర పనుల నిమిత్తం తప్ప బయట తిరిగేందుకు అనుమతి లేదని ప్రభుత్వం పేర్కొంది. క్రిస్మస్‌ నేపథ్యంలో యూరప్‌ దేశాలైన జర్మనీ, నెదర్లాండ్‌లు ఇప్పటికే లాక్‌డౌన్ ప్రకటించాయి.  

మరోవైపు యూకేలో కరోనా టీకా పంపిణీ కొనసాగుతోంది. ఫైజర్‌ టీకాకు యూకే ఈ నెల 8న అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో 90 ఏళ్ల మార్గరెట్‌ కీనన్‌ ప్రపంచంలో తొలి కరోనా టీకా వేయించుకున్నారు. యూకేలో మొదటి వారంలో సుమారు 1.37 లక్షల మందికి టీకా మొదటి డోసు అందింది. 

ఇవీ చదవండీ..

వ్యాక్సిన్‌ క్యాలికులేటర్‌.. వంతెప్పుడో చెప్తుంది!

అలా చేయకపోతే..చైనా నుంచి మరో మహమ్మారిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని