వారికి కరోనా పరీక్షలు తప్పనిసరి..! - uk returnees to be tested for covid
close
Updated : 02/01/2021 14:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారికి కరోనా పరీక్షలు తప్పనిసరి..!

యూకే రిటర్న్స్‌: కేంద్రం తాజా మార్గదర్శకాలు

దిల్లీ: కొత్త రకం కరోనా వైరస్ ఆందోళనల నేపథ్యంలో యూకే నుంచి వచ్చే ప్రయాణికులపై కేంద్రం ప్రత్యేక దృష్టిపెట్టింది. జనవరి 8 నుంచి 30 మధ్యలో ఆ దేశం నుంచి భారత్‌కు వచ్చేవారికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అలాగే సదరు ప్రయాణికులే పరీక్షలకయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. బ్రిటన్ నుంచి విమాన రాకపోకలకు కేంద్రం షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 8 నుంచి రాకపోకలకు అవకాశం కల్పించింది. జనవరి 23 వరకు వారానికి 15 సర్వీసులను మాత్రమే అనుమతించింది. దానికి సంబంధించిన వివరాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

మార్గదర్శకాల ప్రకారం..

► యూకే నుంచి బయలుదేరడానికి 72 గంటల ముందు నిర్వహించిన పరీక్షలో నెగెటివ్‌గా తేలిన కొవిడ్ రిపోర్ట్ తప్పనిసరి.

► ప్రయాణికుడిని విమానంలోకి అనుమతించే ముందు విమానయాన సంస్థలు ఈ రిపోర్ట్‌ను పరిశీలించాలి.

► ఆర్టీపీసీఆర్‌ పరీక్ష లేక ఫలితం కోసం ఎదురుచూసేవారికి  విమానాశ్రయంలో సరైన సదుపాయాలు కల్పించాలి. 

► పాజిటివ్‌గా తేలిన వారిని ప్రత్యేక సంస్థాగత ఐసోలేషన్‌లో ఉంచాలి.

► నెగెటివ్‌గా నిర్ధారించుకోవడానికి వారిని 14వ రోజు మరోసారి పరీక్షించాలి. నెగెటివ్‌గా తేలేవరకూ వారు ఐసోలేషన్‌లోనే ఉండాల్సి ఉంటుంది.

► పాజిటివ్‌గా తేలిన వ్యక్తితో ప్రయాణించిన అదే వరసలోని ప్రయాణికులు, అటూఇటూ మూడు వరసల్లో ఉన్నవారికి సంస్థాగత క్వారంటైన్ తప్పనిసరి.

► విమానాశ్రయంలో నెగెటివ్‌గా తేలిన వ్యక్తి స్థానిక యంత్రాంగం పర్యవేక్షణలో తప్పనిసరిగా 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది.

యూకేలో కరోనా కొత్త స్ట్రెయిన్ బయటపడటంతో గతేడాది డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 31 వరకు కేంద్రం ఆ దేశం నుంచి విమాన సర్వీసులను రద్దు చేసింది. తర్వాత ఆ రద్దును జనవరి ఏడు వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. కాగా, దేశంలో ఇప్పటివరకు 29 కొత్త రకం కరోనా కేసులు వెలుగుచూశాయి. 

ఇవీ చదవండి:

దేశవ్యాప్తంగా 3కోట్ల మందికి ఉచిత టీకా!

ఒకటితో మొదలై..కోటికి చేరిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని