భారత్‌లో 242కు చేరిన స్ట్రెయిన్‌ కేసులు - uk south africa brazilian covid strain cases in india now at 242
close
Published : 04/03/2021 20:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో 242కు చేరిన స్ట్రెయిన్‌ కేసులు

వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: భారత్‌లో యూకే, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాల్లో వెలుగు చూసిన స్ట్రెయిన్‌ కేసుల సంఖ్య 242 కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఈ కరోనా స్ట్రెయిన్‌ల వల్లే కొన్ని వారాలుగా ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. యూకే వైరస్‌ కన్నా బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా వేరియంట్లు వేగంగా వ్యాపించే లక్షణాలను కలిగి ఉన్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇవే కాకుండా భారత్‌లోని మహారాష్ట్ర, కేరళల్లో ఎన్‌440, ఈ484క్యూ అనే రెండు కొత్త వేరియంట్లను పరిశోధకులు గుర్తించినట్లు కేంద్రం గతంలో వెల్లడించింది.

మరోవైపు కొన్ని వారాలుగా భారత్‌లో నమోదయ్యే కేసుల్లో హెచ్చుతగ్గులు ఆందోళన కల్గిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో కఠిన నిబంధనలు విధించింది. అంతర్జాతీయ ప్రయాణికులు కరోనాపై అప్రమత్తంగా ఉండాలంటూ కొన్ని నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ వైరస్‌లను నియంత్రించే వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరుగుతున్నట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) వెల్లడించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని