చండీగఢ్‌: 70 శాతం‌లో ‘యూకే స్ట్రెయిన్‌’! - uk variant detected in 70 per samples in chandigarh sent by pgimer
close
Published : 16/04/2021 19:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చండీగఢ్‌: 70 శాతం‌లో ‘యూకే స్ట్రెయిన్‌’!

చండీగఢ్‌: కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో యూకే రకం కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. 60 శాంపిల్స్‌ను దిల్లీలోని జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రానికి పంపగా 70 శాతంలో యూకే స్ట్రెయిన్‌ ఉన్నట్టు తేలింది. 20 శాతం నమూనాల్లో 681 హెచ్‌ మ్యుటెంట్‌ ఉన్నట్టు గుర్తించామని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌) డైరెక్టర్‌ జగత్‌ రామ్‌ ప్రకటించారు. సదరు సంస్థలోని‌ వైరాలజీ విభాగం‌ మార్చిలో 60 పాజిటివ్‌ శాంపిల్స్‌‌ను జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రానికి పంపించినట్టు తెలిపారు. వీటిలో ఒక నమూనాలో మాత్రం డబుల్‌ మ్యుటేషన్‌ ఉందన్నారు. యూకే రకం వైరస్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని జగత్‌ రామ్‌ సూచించారు. జనం రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలన్నారు. అలాగే అనవసర ప్రయాణాలు మానుకోవాలని, వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని