యూకే స్ట్రెయిన్‌లో జన్యుమార్పులు - uk variant of covid-19 has mutated again: scientists
close
Published : 09/02/2021 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూకే స్ట్రెయిన్‌లో జన్యుమార్పులు

గుర్తించిన శాస్త్రవేత్తలు

లండన్‌: యూకేలో గుర్తించిన కొత్తరకం కరోనా వైరస్‌ మళ్లీ జన్యుమార్పిడి చెందుతోందని పరిశోధకులు గుర్తించారు. ఈ484కే గా పిలిచే ఈ రకాన్ని ఇప్పటికే దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ వేరియంట్స్‌లో ఇప్పటికే గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. మార్పు చెందిన వైరస్‌పై వ్యాక్సిన్‌ అంత ప్రభావం చూపడంలేదని పరిశోధనల్లో తేలినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తుతమున్న యూకే వైరస్‌పై వ్యాక్సిన్‌ ప్రభావవంతంగా పనిచేస్తోందని తెలిపారు. అయితే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొనేందుకు యూకే ఇప్పటికే అప్రమత్తమైంది. దేశంలో ప్రయాణ ఆంక్షలు కఠినతరం చేశారు. 2లక్షల కరోనా కేసుల్లో కేవలం 11 కేసులు జన్యుమార్పిడి చెందిన యూకే వైరస్‌గా గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. అన్ని రకాల వైరస్‌లు ఎప్పటికప్పుడు తమని వృద్ధి చేసుకొనేందుకు ఉత్పరివర్తనాలు చేసుకుంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. యూకే స్ట్రెయిన్‌ వైరస్‌పై మోడెర్నా టీకా బాగా పనిచేస్తోందని తెలిపారు. కాగా యూకేలో త్వరలో మరో నోవావాక్స్‌, జాన్‌సెన్‌ సంస్థలకు చెందిన వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి.

ఇవీ చదవండి..

చర్చలకు సిద్ధమే.. తేదీ చెప్పండి..

17 రాష్ట్రాల్లో కరోనా మరణాల్లేవ్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని