‘అంపైర్స్‌ కాల్‌’తో తలనొప్పి: కోహ్లీ - umpires call creating lot of confusion if ball is hitting stumps it should be out: kohli
close
Published : 23/03/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అంపైర్స్‌ కాల్‌’తో తలనొప్పి: కోహ్లీ

పుణె: నిర్ణయ సమీక్ష వ్యవస్థ (డీఆర్‌ఎస్‌)లో ‘అంపైర్స్‌ కాల్‌’ విధానం గందరగోళం సృష్టిస్తోందని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ విమర్శించాడు. బాల్‌ ట్రాకింగ్‌లో బంతి కొద్దిగా వికెట్లను తాకినా ఎల్‌బీడబ్ల్యూ నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. ఇంగ్లాండ్‌తో తొలి వన్డేకు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుతం అంపైర్స్‌ కాల్‌ను సవాల్‌ చేస్తే బాల్‌ ట్రాకింగ్‌లో బంతి 50% వికెట్లను తాకితేనే ఔటిస్తున్న సంగతి తెలిసిందే.

‘డీఆర్‌ఎస్‌ లేనప్పుడూ నేను సుదీర్ఘంగా క్రికెట్‌ ఆడాను. బ్యాట్స్‌మెన్‌కు ఇష్టమున్నా లేకున్నా అంపైర్‌ తీసుకున్న నిర్ణయం అలాగే ఉంటుంది. అంతేకాకుండా నిజానికి ఔటైనా బంతి కొద్దిగా వికెట్లను తాకినా అంపైర్‌ నాటౌట్‌ ఇస్తే ఇక అంతే’ అని కోహ్లీ అన్నాడు. ‘నా ఉద్దేశంలో ప్రస్తుతం అంపైర్స్‌ కాల్‌ గందరగోళం సృష్టిస్తోంది. బ్యాట్స్‌మన్‌ బౌల్డ్‌ అయితే బంతి 50 శాతానికి పైగా తాకిందా లేదా అని చూడరు కదా. బెయిల్స్‌ ఎగిరాయంటే ఔటైనట్టే లెక్క’ అని విరాట్‌ అన్నాడు.

‘... అందుకే క్రికెట్‌ ప్రాథమిక పరిజ్ఞానంతో చూసినా దీనిపై ఎలాంటి చర్చకు తావుండకూడదు. బంతి వికెట్లను తాకిందంటే నచ్చినా నచ్చకపోయినా ఔటే. సమీక్ష కోల్పోవాల్సిందే. ఇది చాలా సులువైంది. బంతి ఎంత మేర తాకిందన్న నిర్ణయం తికమక పెడుతోంది. పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం మరోటి ఉంది. బ్యాటర్‌‌ ఔటైనప్పుడు సాఫ్ట్‌ సిగ్నల్‌కు ఫీల్డింగ్‌ జట్టుపై పడే ప్రభావమూ ముఖ్యమే. అందుకే క్రీడా స్ఫూర్తి, మార్గదర్శకాలను మనం ప్రశ్నించాల్సిందే. భవిష్యత్తులో పెద్ద టోర్నీలో జరుగుతాయి. ఆటలో లోపాలు ఉండకూడదు. వాటిని సరి చేయాలి’ అని కోహ్లీ సూచించాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని