కరోనా టీకా తీసుకున్న ఐరాస సెక్రటరీ జనరల్‌ - un chief antonio guterres received covid19 vaccine
close
Published : 29/01/2021 13:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా టీకా తీసుకున్న ఐరాస సెక్రటరీ జనరల్‌

న్యూయార్క్‌: ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ తొలి డోసు కొవిడ్‌-19 టీకాను నేడు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీలైనంత త్వరగా కరోనా టీకాను తీసుకోవాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికీ, ప్రతిచోటా వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ప్రభుత్వాలకు సూచించారు.

71 ఏళ్ల గుటెర్రస్‌, న్యూయార్క్‌ నగరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కరోనా టీకా వేయించుకున్నారు. అనంతరం చేతితో విజయ చిహ్నం చూపుతున్న ఓ వీడియోను ఆయన సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ‘‘కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి సిబ్బంది, దౌత్యవేత్తలకు భాగం కల్పించినందుకు న్యూయార్క్‌ నగరానికి కృతజ్ఞతలు. కరోనా మహమ్మారిపై ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధంలో పరస్పర సహకారం అతి కీలకం’’ అని వ్యాఖ్యానించారు.

కాగా, 65 ఏళ్లు పైబడిన తమ పౌరులందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్ అందజేస్తున్నామని.. ఈ క్రమంలో ఐరాస సెక్రటరీ జనరల్‌కు కూడా టీకా ఇచ్చామని న్యూయార్క్‌ నగర మేయర్‌ కార్యాలయం ప్రకటించింది.

ఇవీ చదవండి..

మాస్క్‌పై మాస్క్‌.. ప్రయోజనమెక్కువ

భారత్‌ ప్రపంచానికే ఆస్తి.. ఐరాసAdvertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని