అంబులెన్స్‌ దొరక్క.. కారుపైనే అంతిమయాత్ర! - unable to find ambulance man ties fathers body to car roof to reach crematorium
close
Published : 26/04/2021 12:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంబులెన్స్‌ దొరక్క.. కారుపైనే అంతిమయాత్ర!

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ సృష్టిస్తున్న కల్లోలం కారణంగా.. అనారోగ్యంతో మరణించిన వారి మృతదేహాల తరలింపునకు బాధితులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తాజాగా అగ్రాలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించేందుకు అంబులెన్స్‌ దొరక్క బాధిత కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. చివరకు చేసేదేం లేక తమ కారుపైనే మృతదేహాన్ని కట్టి శ్మశాన వాటికకు తరలించడం చూపరులను కంటతడి పెట్టించింది.

మీడియా వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. యూపీలోని అగ్రాకు చెందిన యోగేశ్వర్‌(67) అనే విశ్రాంత ఉద్యోగి.. అనారోగ్య కారణాలతో 23న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న క్రమంలో ఆయన గుండెపోటుతో మరణించారు. దీంతో ఆస్పత్రి వర్గాలు విషయాన్ని కుటుంబీకులకు తెలియజేశాయి. ఈక్రమంలో మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించేందుకు బాధిత కుటుంబం అంబులెన్స్‌ కోసం ప్రయత్నించింది. కరోనా విజృంభిస్తున్న సమయం కావడంతో ఎంత ప్రయత్నించినా వారికి అంబులెన్స్‌ దొరకలేదు. సాయం చేసేవారు కూడా లేని పరిస్థితిలో మృతుడి కుమారుడు తమ కారుపైనే శవాన్ని కట్టుకుని అంతిమయాత్ర నిర్వహించారు.

కాగా, అగ్రాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. నగరంలో నిత్యం 600పైగా కేసులు నమోదవుతున్నాయి.  గత తొమ్మిది రోజుల్లో 35 మంది కరోనాతో మరణించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సైతం కరోనా బారిన పడిన రోగులు అగ్రాలోని ఆస్పత్రులకు వస్తుండటంతో ప్రైవేటు ఆస్పత్రులు నిండిపోయి దర్శనమిస్తున్నాయని స్థానికులు అంటున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని