కొవాగ్జిన్: విదేశాల్లో ఉత్పత్తికి కేంద్రం ప్రయత్నాలు! - union govt explores covaxin production outside india
close
Published : 21/05/2021 21:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవాగ్జిన్: విదేశాల్లో ఉత్పత్తికి కేంద్రం ప్రయత్నాలు!

ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారం తీసుకునే యోచన

దిల్లీ: దేశంలో నెలకొన్న కరోనా వ్యాక్సిన్‌ కొరతను అధిగమించేందుకు దేశీయంగా భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ ఉత్పత్తిని విదేశాలకు విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు కొవాగ్జిన్‌ ఉత్పత్తిని వేగంతం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సహకారం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సహా ఇతర వ్యాక్సిన్‌లకు సంబంధించిన సాంకేతికతను దేశీయ కంపెనీలకు బదిలీ చేసే అంశంపైనా చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. వీటికి సంబంధించి మే 18న జరిగిన మంత్రివర్గ భేటీలో చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

ఇక ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ల దేశీయ తయారీకి మరిన్ని సంస్థలకు అనుమతి ఇవ్వాలని భారత విదేశాంగశాఖ ఇప్పటికే ఆ సంస్థను కోరింది. కొవిషీల్డ్‌ ఉత్పత్తికి అవసరమైన ముడిపదార్థాల సరఫరాకు ఉన్న అడ్డంకులను పరిష్కరించడానికి కార్యాచరణను కేంద్రం సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీటిపై భారత్‌తో పాటు సీరం ఇన్‌స్టిట్యూట్‌ చేసిన అభ్యర్థనకు అమెరికా అధ్యక్ష భవనం కూడా సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ తయారీ అత్యంత సంక్లిష్టమైందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సజీవ వైరస్‌ను నిర్వీర్యం చేసే ఈ ప్రక్రియ అత్యాధునిక బీఎస్‌ఎల్‌-3 లేబొరేటరీల్లో మాత్రమే సాధ్యమవుతుంది. అప్పుడే వైరస్‌ బయటికి రాకుండా, శాస్త్రవేత్తలకు సోకకుండా ఉంటుంది. ఈ సౌకర్యాలు ఇప్పటికిప్పుడు తయారుచేయడం సాధ్యంకాదు. అందువల్ల ఇప్పటికే అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుందని నీతిఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ స్పష్టం చేశారు. భారత్‌లో ఇతర సంస్థల్లో ఇటువంటి సౌకర్యాలు లేనందుకు విదేశాల్లో తయారు చేసే అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని