టీకా కొరత లేదు.. అవన్నీ ఆరోపణలే: కేంద్రం - union health minister on vaccine shortage in maharastra issue
close
Published : 08/04/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా కొరత లేదు.. అవన్నీ ఆరోపణలే: కేంద్రం

దిల్లీ: మహారాష్ట్రలో వ్యాక్సిన్ల కొరత ఉందంటూ ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ స్పందించారు. ఆ ఆరోపణలు పూర్తి నిరాధారమైనవని కొట్టిపారేశారు. కొన్ని రాష్ట్రాలు కరోనాపై పోరును రాజకీయం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. కరోనాను మహారాష్ట్ర కట్టడి చేయలేకపోయిందని ఆక్షేపించారు. మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు కరోనాను కట్టడిలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. అర్హత కలిగిన వారికి టీకాలు వేయకుండా.. అందరికీ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ.. ప్రజల్లో భయాన్ని వ్యాప్తి చేయడం తగదని మండిపడ్డారు. మహారాష్ట్రలో వ్యాక్సిన్ కొరత ఉందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు కరోనాను నియంత్రించడంలో పదేపదే విఫలమవుతున్న అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు చేసిన ప్రయత్నమే తప్ప మరొకటి కాదన్నారు. ఇవి బాధ్యతారాహిత్యంతో చేసిన వ్యాఖ్యలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని