సీఎం జగన్‌కు కేంద్రమంత్రి హర్షవర్థన్‌ ఫోన్‌ - union minister harsh vardhan discussed with cm jagan on coronavirus
close
Published : 16/07/2020 03:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీఎం జగన్‌కు కేంద్రమంత్రి హర్షవర్థన్‌ ఫోన్‌

దిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్‌ ఫోన్‌ చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎంతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పెద్దఎత్తున పరీక్షలు జరపడంపై దృష్టి పెట్టామని ఈ సందర్భంగా సీఎం జగన్‌ వివరించారు. రోజుకు 22 వేలకు పైగా టెస్టులు జరుపుతున్నామన్నారు. వ్యాధి లక్షణాలను ముందుగా గుర్తించి, బాధితులకు త్వరితగతిన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 1.17 శాతంగా ఉన్న మరణాల రేటును 1 శాతం కంటే దిగువకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సీఎం వివరించారని హర్షవర్థన్‌ తెలిపారు. కొవిడ్‌పై పోరుకు రూ.179 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినట్లు హర్షవర్థన్‌ వెల్లడించారు. కేసులు అధికంగా నమోదు అవుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరోగ్యమంత్రులతో హర్షవర్థన్‌ ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా సీఎం జగన్‌తో ఇవాళ మాట్లాడారు. అంతకుముందు కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో ఆయన మాట్లాడారు.
 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని