కేంద్రమంత్రి జావడేకర్‌కు కరోనా  - union minister prakash javadekar tests positive for covid-19
close
Published : 16/04/2021 22:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేంద్రమంత్రి జావడేకర్‌కు కరోనా 

దిల్లీ: దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. రోజూ రెండు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. తాజాగా కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. గత రెండు, మూడు రోజుల్లో తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నితిన్‌ గడ్కరీ, స్మృతి ఇరానీ సహా పలువురు కేంద్రమంత్రులు, నేతలు ట్వీట్లు చేస్తున్నారు. భాజపా నేత, కర్ణాటక సీఎం యడియూరప్పకు రెండోసారి కరోనా సోకడంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని