ఆ యాడ్‌లోని చిన్నారి కృతిశెట్టినే..! - unseen advertisements of kritishetty
close
Published : 01/03/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ యాడ్‌లోని చిన్నారి కృతిశెట్టినే..!

చిన్నప్పుడే కెమెరా ముందుకొచ్చిన బేబమ్మ

హైదరాబాద్‌: తొలిసినిమాతోనే సూపర్‌హిట్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు కథానాయిక కృతిశెట్టి. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’లో ఆమె వైష్ణవ్‌తేజ్‌ సరసన బేబమ్మగా నటించి ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టారు. మొదటి సినిమానే అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా ఆమె నటించిన విధానం చూసి సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, కృతి చిన్నతనంలోనే కెమెరా ముందు తళుక్కున మెరిశారు.

స్కూల్‌కు వెళ్లే వయసులో ఉన్నప్పుడే మొట్టమొదటిసారి ఓ వస్త్ర దుకాణాల వాణిజ్య ప్రకటనలో కృతిశెట్టి పాల్గొన్నారు. అనంతరం ‘లైఫ్‌బాయ్‌’, ‘డైరీమిల్క్‌ చాక్లెట్‌’తోపాటు ఓ పెన్నుల కంపెనీ యాడ్‌లో కూడా ఆమె నటించారు. హృతిక్‌రోషన్‌ కథానాయకుడిగా 2019లో విడుదలైన ‘సూపర్‌ 30’లో సైతం కృతిశెట్టి ఓ సన్నివేశంలో కనిపించారు. మన బేబమ్మ నటించిన కొన్ని వాణిజ్య ప్రకటనలను మీరూ ఓసారి చూసేయండి..!


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని