Yogi Adityanath: కొవిడ్‌తో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ₹10లక్షలు - up cm hands over cheques 55 journalists families who died due to covid
close
Published : 01/08/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Yogi Adityanath: కొవిడ్‌తో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ₹10లక్షలు

లఖ్‌నవూ: కరోనా సమయంలో ప్రాణాల్ని లెక్కచేయకుండా విధులు నిర్వహించి వైరస్‌ కాటుకు బలైపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయిన 55మంది పాత్రికేయుల కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రూ.10లక్షల చొప్పున సాయం అందించారు. ఈ మేరకు లోక్‌భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో చెక్కులు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ బారిన పడి అనేకమంది ఎడిటర్లు, పాత్రికేయులు, మీడియా సిబ్బంది తమ ప్రాణాల్ని కోల్పోయారన్నారు. ఆ లోటును పూడ్చలేమని, కానీ ఆ కుటుంబాలకు అండగా నిలబడగలమని తెలిపారు. పాత్రికేయ సిబ్బందికి అన్నివిధాలా తోడ్పాటు అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. పాత్రికేయ సిబ్బంది సేవలను ప్రశంసించారు. రాష్ట్రంలో దాదాపు 25వేలమంది పాత్రికేయులకు వ్యాక్సిన్‌ వేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో సరిపడా వ్యాక్సిన్‌ నిల్వలు ఉన్నాయని, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నట్టు పేర్కొన్నారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని