నవ్వించే బుల్లోడు వచ్చేస్తున్నాడు! - update on allari naresh new movie
close
Published : 13/01/2021 11:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నవ్వించే బుల్లోడు వచ్చేస్తున్నాడు!

హైదరాబాద్‌: అల్లరి నరేష్‌ కథానాయకుడిగా, గిరి.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బంగారు బుల్లోడు’. పూజా ఝవేరి కథానాయిక. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. జనవరి 23న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ‘‘అల్లరి నరేష్‌ కెరీర్‌లో మరో చక్కటి హాస్యభరిత చిత్రమిది. పేరొందిన పలువురు హాస్యనటులు ఇందులో కనిపిస్తారు. వాళ్లపై చిత్రీకరించిన సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయ’’ని సినీ వర్గాలు తెలిపాయి. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్, వెన్నెల కిశోర్, సత్యం రాజేశ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సతీష్‌ ముత్యాల, కూర్పు: ఎమ్‌.ఆర్‌.వర్మ.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని