బాక్సింగ్‌ బరిలో దిగిన ఉపేంద్ర - upendra joins the shoot of ghani
close
Published : 18/02/2021 21:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాక్సింగ్‌ బరిలో దిగిన ఉపేంద్ర

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుణ్‌ తేజ్‌ కథానాయకుడుగా బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి దర్శకుడు. ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు ఉపేంద్ర.  ఈ సినిమా ఇటీవలే తొలి షెడ్యూల్‌ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న సెకండ్‌ షెడ్యూల్‌ షూటింగ్‌లో ఉపేంద్ర అడుగుపెట్టారు. నాయకాప్రతినాయకులపై పలు కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. వరుణ్‌ సరసన బాలీవుడ్‌ భామ సయీ మంజ్రేకర్‌ నటిస్తోంది. జగపతిబాబు,నవీన్‌ చంద్ర, సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

కథానాయకుడుగా వరుణ్‌కి 10వ సినిమా. బాక్సర్‌ పాత్రలో ఒదిగిపోవడానికి వరుణ్‌తేజ్‌ ఒలింపిక్‌ విజేత టోని జెఫ్రీస్‌ దగ్గర ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకున్నారని సినీ వర్గాలు తెలిపాయి. జులై 30న ఈ సినిమా విడుదల కానుంది. 

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని