Cinema News: ‘ఏజెంట్‌’కి తోడుగా..! - upendra key role in akhil agent
close
Published : 07/06/2021 11:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: ‘ఏజెంట్‌’కి తోడుగా..!

హైదరాబాద్‌: అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘ఏజెంట్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయిక. ఇందులో ఓ కీలక పాత్ర కోసం ప్రముఖ నటుడిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం తొలుత మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ను సంప్రదించినట్లు ప్రచారం వినిపించింది. ఇప్పుడా పాత్ర కన్నడ నటుడు ఉపేంద్ర వద్దకు వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే చిత్ర బృందం ఆయనతో కథ విషయమైన చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఏప్రిల్‌లోనే రెగ్యులర్‌ చిత్రీకరణ జరగాల్సి ఉండగా.. కొవిడ్‌ పరిస్థితుల వల్ల తాత్కాలికంగా ఆగిపోయింది. ప్రస్తుతం జులై నుంచి షూటింగ్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని