Uppena​: రౌడీలతో వైష్ణవ్‌ ఫైట్‌ చేశాడిలా..! - uppena​ fight making video
close
Updated : 27/04/2021 15:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Uppena​: రౌడీలతో వైష్ణవ్‌ ఫైట్‌ చేశాడిలా..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: తొలి చిత్రంతోనే హీరో-హీరోయిన్‌తో పాటు డైరెక్టర్‌కు మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా ‘ఉప్పెన’. వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి జంటగా డైరెక్టర్‌ బుచ్చిబాబు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 12న విడుదలై ఇటు ప్రేక్షకులను అలరించడంతో పాటు.. అటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకుందీ చిత్రం. దేవిశ్రీప్రసాద్‌ అందించిన సంగీతం చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. కాగా.. సినిమా చిత్రీకరణ సందర్భంగా ఒక్కొక్క సన్నివేశాన్ని తెరకెక్కించిన విధానాన్ని డైరెక్టర్‌ బుచ్చిబాబు యూట్యూబ్‌లో పంచుకుంటూ వస్తున్నారు. తాజాగా.. ఫైట్‌కు సంబంధించిన ఒక మేకింగ్‌ వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేశారు. హీరో-హీరోయిన్‌ ఇంట్లో నుంచి పారిపోయేక్రమంలో మెడపై కత్తిపెట్టుకోవడం.. ఆ తర్వాత రౌడీలతో హీరో చేసే ఫైట్‌ చేయడం.. ఈ మొత్తం తీరును ఆ వీడియోలో చూపించారు. దీంతో పాటు సముద్రతీరంలో సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన దృశ్యాలను కూడా ఆయన మరో వీడియోలో పంచుకున్నారు. మీరూ చూసేయండి.





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని