‘ఉప్పెన’.. డైరెక్టర్‌గా వైష్ణవ్‌ తేజ్‌ - uppena making video
close
Published : 15/04/2021 11:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఉప్పెన’.. డైరెక్టర్‌గా వైష్ణవ్‌ తేజ్‌

హైదరాబాద్‌: కథానాయకుడు వైష్ణవ్‌తేజ్‌ దర్శకుడిగా అవతారమెత్తారు. మెగా మైక్‌ పట్టుకున్న ఆయన రెడీ, కెమెరా, యాక్షన్‌ అంటూ సన్నివేశాలను సైతం డైరెక్ట్‌ చేశారు. అది కూడా ‘ఉప్పెన’ మూవీ కోసం. దానికి సంబంధించిన ఓ వీడియోని బుచ్చిబాబు సనా షేర్‌ చేశారు. వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి వెండితెరకు పరిచయమైన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ అపురూప ప్రేమకావ్యం ఫిబ్రవరిలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఉప్పెన’ మేకింగ్‌ వీడియోలను చిత్ర దర్శకుడు గత కొన్నిరోజుల నుంచి యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు.

కాగా, తాజాగా మరో సరికొత్త మేకింగ్‌ వీడియోని బుచ్చిబాబు సినీ ప్రియులతో పంచుకున్నారు. ఇందులో విజయ్‌ సేతుపతి, రాజీవ్‌ కనకాల, కృతిశెట్టికి సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ ఎలా జరిగిందో చూపించారు. అంతేకాకుండా డైరెక్టర్‌గా కెమెరా ముందు కూర్చొన్న వైష్ణవ్‌తేజ్‌.. స్టార్ట్‌, కెమెరా, యాక్షన్‌ అంటూ సరదాగా కొంత సమయంపాటు దర్శకుడి అవతారమెత్తారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని