ఓటీటీలో ‘ఉప్పెన’: వచ్చేది అప్పుడేనా? - uppena ott release here the date
close
Published : 19/02/2021 19:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటీటీలో ‘ఉప్పెన’: వచ్చేది అప్పుడేనా?

ఇంటర్నెట్‌డెస్క్‌: వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా అలరిస్తోంది. ప్రస్తుతం థియేటర్‌లలో సందడి చేస్తున్న ‘ఉప్పెన’ ఓటీటీలో ఎప్పుడు వస్తుందా? అని యూత్‌ సోషల్‌మీడియా వేదికగా తెగ వెతికేస్తున్నారు. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమా ఓటీటీకి రావడానికి మరికొంతకాలం పట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి.

ఇప్పటికే ఈ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్‌’ దక్కించుకుందట. అమెజాన్‌ ప్రైమ్‌, ఆహాల నుంచి గట్టి పోటీ ఎదురైనా అదిరిపోయే రేటుకు ‘ఉప్పెన’ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుందట. సినిమా విడుదలై 50రోజుల పూర్తయిన తర్వాతే ఓటీటీలో వచ్చే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఏప్రిల్‌ 11న ‘ఉప్పెన’ ఓటీటీలో సందడి చేయనుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని