ఆ 5 రాష్ట్రాల్లో కరోనా విజృంభణ - upsurge in daily new covid-19 cases in five states
close
Published : 20/02/2021 14:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ 5 రాష్ట్రాల్లో కరోనా విజృంభణ

భద్రతా ప్రమాణాలు మరవొద్దని కేంద్రం

దిల్లీ: దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి కట్టడిలోనే ఉన్నప్పటికీ మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో మాత్రం రోజువారీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని, వ్యాప్తిని అరికట్టే నిబంధనలు పాటించడంలో అలసత్వం ప్రదర్శించొద్దని సూచించింది. 

‘‘గత వారం రోజులుగా కేరళలో రోజువారీ కేసులు అత్యధికంగా ఉంటున్నాయి. ఇక మహారాష్ట్రలోనూ అదే పరిస్థితి ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో నమోదైన కొత్త కేసుల్లో 75.87శాతం ఈ రెండు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వీటితో పాటు పంజాబ్‌, చత్తీస్‌గఢ్‌లలోనూ రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 13 నుంచి మధ్యప్రదేశ్‌లో కొత్త కేసుల సంఖ్య అధికమవుతోంది’’ అని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కేంద్రం సూచించింది. కరోనా వ్యాప్తి చైన్‌ను విడగొట్టేందుకు గానూ.. మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం వంటివి పాటించాలని, అప్పుడే వైరస్‌ను కట్టడిచేయగలమని పేర్కొంది. 

18 రాష్ట్రాల్లో సున్నా మరణాలు..

ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు సున్నాగా ఉన్నాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణ, హరియాణా, జమ్మూకశ్మీర్‌, ఝార్ఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, అసోం, చండీగఢ్‌, లక్షద్వీప్‌, మణిపూర్‌, మేఘాలయ, లద్దాఖ్‌, మిజోరం, సిక్కిం, నాగాలాండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, అండమాన్‌ నికోబార్ దీవులు, దాద్రానగర్ హవేలీ- దయ్యూదామన్‌లలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు ఒక్క కరోనా మరణం కూడా నమోదుకాలేదు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని