ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ విరాళంగా ఇచ్చిన ఊర్వశి  - urvashi rautela foundation donates total of 47 oxygen concentrators
close
Published : 10/06/2021 20:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ విరాళంగా ఇచ్చిన ఊర్వశి 

ఇంటర్నెట్‌ డెస్క్: బాలీవుడ్‌ భామ ఊర్వశి తన నటన, అందంతో ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకుంది. ఆపదలో ఉన్న కొవిడ్‌-19 బాధితులను ఆదుకుంటూ  ఊర్వశి తన ఉదారతను చాటుకుంటోంది. ఈ అందాల భామ ఊర్వశి రౌతేలా ఫాండేషన్‌ ద్వారా మొత్తం 47 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ను విరాళంగా ఇచ్చింది. మొదట ఉత్తరాఖండ్‌కి 27 ఇవ్వగా, మరో 20 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను వివిధ ఆస్పత్రులకు అందించింది. 2 కోట్ల 35 లక్షల విలువ చేసే ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ విరాళంగా ఇచ్చినందుకుగానూ, మంచిపని చేసిందంటూ పలువురు మెచ్చుకుంటున్నారు. ఆ మధ్య ముంబయిని ముంచెత్తిన తౌక్టే తుపాను సందర్భంలోనూ పలువురు పేదలకి మంచినీళ్లు ఆహార పొట్లాలను పంపిణీ చేసింది.  తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా వచ్చే ఆదాయంతో దేశంలోని కొవిడ్‌ బాధితులకు సాయం చేస్తోంది.

ఇటీవల ఈజిప్టు నటుడు మహమ్మద్ రమ్దాన్‌ సరసన ‘వెర్సాస్ బేబీ’ అనే అంతర్జాతీయ ఆల్బమ్‌లో నటించింది. ఈ ఆల్బమ్‌కి మంచి స్పందన కూడా వచ్చింది. ఈ పాటకి వచ్చిన ఆదాయంతో భారతదేశంలోని కొవిడ్ -19 సహాయ నిధికి, పాలస్తీనా సొసైటీకి కొంత మొత్తం అందించారు.  ప్రస్తుతం ఊర్వశి తమిళంలో నిర్మితమయ్యే సైన్సు ఫిక్షన్‌ నేపథ్యంగా తెరకెక్కనున్న భారీ బడ్జెట్‌ చిత్రంలో నటించనుంది. ఇందులో ఆమె మైక్రోబయాలజిస్ట్‌గా కనిపించనుంది. తెలుగులో వస్తున్న ‘బ్లాక్‌ రోజ్‌’ చిత్రంలో నటిస్తోంది. మోహన్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో  తెరకెక్కుతున్న థ్రిల్లర్‌ చిత్రమిది. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. గత ఏడాది హిందీలో ‘వర్జిన్‌ భానుప్రియ’ అనే చిత్రంలో నటించి అలరించింది. 

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని