అమెరికాలో 4 లక్షలకు చేరిన కొవిడ్‌ మరణాలు - us covid 19 death toll crosses 4 lakh
close
Published : 25/01/2021 17:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెరికాలో 4 లక్షలకు చేరిన కొవిడ్‌ మరణాలు

న్యూయార్క్‌: అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 2.5 కోట్లు దాటిందని జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం వెల్లడించింది. కొవిడ్‌ మరణాలు 4 లక్షలు దాటినట్లు పేర్కొంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ స్థాయిలో కేసులు, మరణాలు నమోదు కాలేదని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న ప్రతి 4 కేసుల్లో ఒకటి అమెరికాలో బయటపడుతుండగా.. ప్రతి ఐదు మరణాల్లో ఒకటి ఇక్కడి నుంచే ఉంటోంది. అయితే, రోజువారీ కేసుల్లో గత వారంగా తగ్గుదల కనిపిస్తోంది. జనవరి ఆరంభంలో రోజుకు సరాసరిన 2 లక్షల మంది మహమ్మారి బారిన పడగా ఇప్పుడు ఆ సంఖ్య 1.76 లక్షలకు దిగివచ్చింది. 

ఇటీవలే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ‘జో బైడెన్’‌ మహమ్మారి కట్టడికి జాతీయ ప్రణాళికను విడుదల చేయడం సహా పది కార్యనిర్వాహక దస్త్రాలపై సంతకాలు కూడా చేశారు. వచ్చే 100 రోజుల్లో అమెరికా వ్యాప్తంగా 10 కోట్ల మందికి టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు.  వైరస్‌ను కట్టడి చేయకుంటే నెల రోజుల వ్యవధిలో కొవిడ్‌ మృతుల సంఖ్య 4 లక్షల నుంచి 5 లక్షలకు చేరుతుందని బైడెన్‌ హెచ్చరించారు.

ఇవీ చదవండి...

ఆస్ట్రేలియాలో కరోనా టీకా వినియోగానికి అనుమతి

రికవరీలు, కొత్త కేసులు.. 13 వేల పైనే
 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని