హోటల్‌పై చెడుగా రివ్యూ ఇచ్చాడని జైలుకు.. - us man jailed for giving negative review on thailand hotel
close
Updated : 11/10/2020 15:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హోటల్‌పై చెడుగా రివ్యూ ఇచ్చాడని జైలుకు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏదైనా హోటల్‌కి వెళ్లాలంటే ఇటీవల కాలంలో ఆ హోటల్‌కు వచ్చిన రివ్యూలను చూసి అక్కడికి వెళ్లాలా? వద్దా? అని నిర్ణయించుకుంటున్నారు. సినిమాలకే కాదు, ఇలా హోటల్‌ సేవలపై రివ్యూలకు కూడా ప్రాధాన్యం ఏర్పడింది. అయితే అమెరికాకు చెందిన ఓ వ్యక్తి థాయ్‌లాండ్‌లోని ఓ హోటల్‌పై చెడుగా రివ్యూ ఇచ్చాడట. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. హోటల్‌ సేవలు నచ్చకపోతే నచ్చలేదనే చెబుతారు. ఆ మాత్రానికే జైల్లో పెడతారా అని ఆశ్చర్యపోతున్నారా? అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో మీరే చదవండి..

అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించిన కథనం ప్రకారం.. అమెరికాకు చెందిన వెస్లే బార్న్స్‌ థాయ్‌లాండ్‌లో ఇంగ్లీష్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతడు కో చాంగ్‌ ఐలాండ్‌లోని సీ వ్యూ కో చాంగ్‌ రిసార్ట్‌ హోటల్‌కు వెళ్లాడట. అక్కడ అతడికి వైన్‌ బాటిల్‌ తెచ్చి ఇచ్చినందుకు సర్వీస్‌ ఛార్జ్‌ కింద 15 యూఎస్‌ డాలర్లు బిల్‌ వేయడంతో అతడు హోటల్‌ సిబ్బందితో గొడవకు దిగాడు. దీంతో అదనపు ఛార్జీ రద్దు చేసి సమస్యను హోటల్‌ యాజమాన్యం పరిష్కరించింది. అయితే, వెస్లే అంతటితో ఊరుకోలేదు. హోటల్‌పై పలుమార్లు దారుణమైన రివ్యూలు రాశాడు. ఆ హోటల్‌కు వెళ్లొద్దని, అక్కడ కరోనా వ్యాప్తి చెందుతుందని రాసుకొచ్చాడు. ఈ విషయం హోటల్‌ యాజమాన్యానికి తెలియడంతో అతడిపై దావా వేసింది. కనీసం ఏడేళ్లు జైలు శిక్ష విధించాలని కోరింది. పోలీసులు వెస్లేని గత నెలలో అరెస్టు చేసి జైలుకి పంపారు. అయితే రెండు రోజులు జైల్లో ఉన్న అతడు బెయిల్‌పై బయటకొచ్చాడు. విచారణ పూర్తయ్యాక అతడికి కనీసం రెండేళ్లు జైలుశిక్ష పడొచ్చని అక్కడి న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఈ విషయంపై హోటల్‌ యాజమాన్యం మాట్లాడుతూ.. దావా వేసేముందు వెస్లేతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని ప్రయత్నించామని వెల్లడించింది. కానీ, వెస్లే నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో దావా వేయాల్సి వచ్చిందని తెలిపింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని