యూఎస్‌ను తలదన్నేందుకు చైనా అడ్డదారులు! - us ncsc agency warns of threats from china collecting americans health data
close
Published : 04/02/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూఎస్‌ను తలదన్నేందుకు చైనా అడ్డదారులు!

వాషింగ్టన్‌: వైద్య రంగంలో అమెరికాను తలదన్నేందుకు చైనా అడ్డదారులు తొక్కుతోందని అగ్రరాజ్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా సమయంలో హ్యాకింగ్‌ ద్వారా అమెరికాకు సంబంధించిన వైద్య సమాచారాన్ని తస్కరించడాన్ని చైనా ముమ్మరం చేసిందని యూఎస్‌ నేషనల్‌ కౌంటర్‌ ఇంటలిజెన్స్‌ సెక్యూరిటీస్‌ సెంటర్‌ (ఎన్‌సీఎస్సీ) వెల్లడించింది. ముఖ్యంగా అమెరికన్ల డీఎన్‌ఏకి సంబంధించిన ముఖ్య సమాచారాన్ని హ్యాకింగ్‌ ద్వారా చైనా తస్కరిస్తోందని ఆరోపిస్తూ.. ఆ దేశంపై మండిపడింది. చైనాకు చెందిన బీజీఐ అనే బయోటెక్నాలజీ సంస్థ చాలా దేశాల్లో కొవిడ్‌ టెస్టుల కిట్లను విక్రయించిందని పేర్కొన్న ఎన్‌సీఎస్సీ.. గత ఆరునెలల్లోనే ఆ సంస్థ18 టెస్టింగ్‌ ల్యాబ్‌లను నెలకొల్పినట్లు వివరించింది. 

అమెరికా బయోటెక్నాలజీ రంగాన్ని తలదన్ని పైకి ఎదిగేందుకు ఈ సమాచారాన్ని చైనా ప్రభుత్వం ఉపయోగిస్తోందని అమెరికా పేర్కొంది. వైద్య సమాచారాన్ని కొల్లగొట్టడం వల్ల అమెరికన్ల గోప్యతకు భంగం వాటిల్లడమే కాకుండా ఆర్థిక వ్యవస్థకు, దేశభద్రతకూ విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఎన్‌సీఎస్సీ హెచ్చరించింది. మరోవైపు చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ ఇప్పటికే 80 శాతం అమెరికన్‌ యువత వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని తస్కరించిందని ఎన్‌సీఎస్సీ మాజీ డైరెక్టర్‌ ఒకరు ఆరోపించడం గమనార్హం.  

ఇదీ చదవండి

రాజ్యసభలో ఫోన్‌ వాడొద్దని తెలియదా?
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని