Joe Biden: భారత్‌లో అయిదుగురు బైడెన్లు ఉన్నారన్న అమెరికా అధ్యక్షుడు.. - us president jokes about biden names in india
close
Updated : 25/09/2021 10:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Joe Biden: భారత్‌లో అయిదుగురు బైడెన్లు ఉన్నారన్న అమెరికా అధ్యక్షుడు..

వారు మీ బంధువులే అని చమత్కరించిన మోదీ

వాషింగ్టన్‌ : భారత దేశంలో ఇంటి పేర్లతో అనుబంధాలు ముడిపెట్టుకోవడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సరదాగా మాట్లాడారు. ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. 1972లో సెనెటర్‌గా తాను తొలిసారి ఎన్నికైనప్పుడు ముంబయి నుంచి ఓ వ్యక్తి లేఖ రాస్తూ.. తన ఇంటి పేరు బైడెన్‌ అని పేర్కొన్నారని గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యక్షుడి హోదాలో ముంబయి వచ్చినప్పుడు కొందరు విలేకరులు ఇదే విషయంపై తనను అడిగారని చెబుతూ.. ఆ మరుసటి రోజే భారత్‌లో అయిదుగురు బైడెన్లు ఉన్నారని పత్రికలు రాశాయని తెలిపారు. అయితే, వారి గురించి తానెపుడూ ఆరా తీయలేదన్నారు. బహుశా ఇవాళ్టి సమావేశం అందుకు ఏమైనా ఉపయోగపడుతుందేమోనంటూ చమత్కరించారు. దీనికి సంబంధించి తాను కొన్ని పత్రాలను తీసుకొచ్చినట్లు తెలిపిన భారత ప్రధాని మోదీ... ‘వారు మీ బంధువులే’ అని తెలిపినప్పుడు హాలులో నవ్వులు విరిశాయి.

శుక్రవారం ఉదయం శ్వేతసౌధానికి చేరుకున్న భారత ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. బైడెన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇద్దరు నేతలు ముఖాముఖీ కలుసుకోవడం ఇదే ప్రథమం. ఇప్పటి వరకూ ఫోన్‌ ద్వారా సంభాషించుకున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని