వ్యాక్సిన్‌ వేసుకోని వారికే ఇక్కడ ఎంట్రీ.. - us restaurant serves only for unvaccinated people
close
Published : 29/07/2021 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాక్సిన్‌ వేసుకోని వారికే ఇక్కడ ఎంట్రీ..

వాషింగ్టన్‌: కరోనాను కట్టడి చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అమెరికాలో అందరూ టీకా తీసుకోవాలని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్‌ వేసుకుంటే ప్రోత్సాహకాలు, బహుమతులు ఇస్తున్నారు. ఇంత చేస్తున్నా.. కొంత మంది మాత్రం వ్యాక్సిన్‌ వేసుకోవడానికి విముఖత చూపుతున్నారు. అందుకే ఎక్కడికి వెళ్లినా టీకా వేసుకున్నట్లు రుజువు చూపిస్తేనే అనుమతి ఇవ్వాలన్న నిబంధన తీసుకొచ్చారు. దీంతో దుకాణాలు, రెస్టారెంట్ల సిబ్బంది టీకా తీసుకున్న కస్టమర్లను మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే, ఈ నిబంధనకు విరుద్ధంగా ఓ రెస్టారెంట్‌ వ్యాక్సిన్‌ వేసుకోని వారికి స్వాగతం పలుకుతోంది. 

కాలిఫోర్నియాలోని హంటింగ్టన్‌ బీచ్‌లో ఉన్న బాసిలికోస్‌ పాస్తా ఇ వినో రెస్టారెంట్‌లోకి వెళ్లాలంటే వ్యాక్సిన్‌ వేయించుకోలేదని రుజువు చూపించాలట. కేవలం వ్యాక్సిన్‌ వేసుకోని వారికే ఫుడ్‌ సర్వ్‌ చేస్తామని రెస్టారెంట్‌ యాజమాన్యం ప్రకటించింది. దీంతో స్థానిక ప్రభుత్వం స్పందించి పాలసీని మార్చుకోవాలని సూచించినా రెస్టారెంట్‌ మాత్రం ససేమిరా అంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పాలసీని మార్చుకునేది లేదంటూ సోషల్‌మీడియా వేదికగా స్పష్టం చేసింది. గత ఏడాది కూడా ఈ రెస్టారెంట్‌ యాంటీ మాస్క్‌ ప్రచారాన్ని నిర్వహిస్తూ వార్తలోకెక్కింది. గతేడాదంతా మాస్క్‌ లేకుండా ఇంటి నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితులు ఏర్పడగా.. తమ రెస్టారెంట్లోకి రావాలంటే మాస్క్‌ ధరించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. కాగా.. ఈ రెస్టారెంట్‌ తీరుపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని