కౌశిక్‌.. స్థాయి తెలుసుకొని మాట్లాడు: ఉత్తమ్‌! - uttam response on kaushik reddy comments
close
Updated : 13/07/2021 13:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కౌశిక్‌.. స్థాయి తెలుసుకొని మాట్లాడు: ఉత్తమ్‌!

హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను ఆ పార్టీ సీనియర్‌ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఖండించారు. రేవంత్‌రెడ్డి, మాణికం ఠాగూర్‌పై కౌశిక్‌ చేసిన ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెరాస నాయకులే కౌశిక్‌రెడ్డితో ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. ఏ నాయకుడైనా స్థాయి తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. తెరాస నాయకులను ప్రసన్నం చేసుకునేందుకే కౌశిక్‌రెడ్డి అలా మాట్లాడారని స్పష్టంగా తెలుస్తోందన్నారు. రూ. 50కోట్లు మాణికం ఠాగూర్‌కు ముట్టజెప్పి రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షపదవిని పొందారని కౌశిక్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై టీపీసీసీ వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కూడా స్పందించారు. కౌశిక్‌రెడ్డి కేవలం బొమ్మ మాత్రమేనని, ఆయనతో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చిలక పలుకులు పలికిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ చరిష్మాతోనే 2018లో కౌశిక్‌ రెడ్డికి ఓట్లు పడ్డాయని  తెలిపారు. సత్తా ఉంటే హుజూరాబాద్‌లో‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు.హుజూరాబాద్‌లో ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్‌ ఇలాంటి కోవర్టులను ప్రయోగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎంతటి వారైనా పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని