కోహ్లీ డకౌట్‌.. పోలీసుల వినూత్న సందేశం  - uttarakhand police witty tweet on virat kohlis duckout in first t20 against england
close
Updated : 13/03/2021 12:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీ డకౌట్‌.. పోలీసుల వినూత్న సందేశం 

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ డకౌట్‌ను‌ ఉత్తరాఖండ్‌ పోలీస్‌ విభాగం వినూత్న ప్రచారానికి వినియోగించుకుంది. శుక్రవారం రాత్రి ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో కోహ్లీ డకౌటైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో భారత్‌ ఘోర ఓటమిపాలైంది. టీమ్‌ఇండియా టాప్‌ఆర్డర్‌ పూర్తిగా విఫలమైంది. కోహ్లీ పరుగుల ఖాతా తెరవకముందే పెవిలియన్‌ చేరాడు.

అయితే, కోహ్లీ డకౌటవ్వడంపై ఉత్తరాఖండ్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఒక అడుగు ముందుకేసి.. రహదార్లపై ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసేవారికి ఓ వినూత్న సందేశం చేరవేశారు. కోహ్లీ పెవిలియన్‌కు వెళ్తున్న ఫొటోను పంచుకొని.. ‘హెల్మెట్‌ ఒక్కటే సరిపోదు. పూర్తి ధ్యాసతో డ్రైవింగ్‌ చేయడం కూడా అత్యంత ఆవశ్యకం. లేకపోతే కోహ్లీ లాగే మీరూ డకౌట్‌ అవుతారు’ అని హిందీలో పోస్టు చేశారు.

ఇక ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 124/7 స్కోర్‌ చేయగా, ఇంగ్లాండ్‌ 15.3 ఓవర్లలోనే స్వల్ప లక్ష్యాన్ని ఛేదించింది. శ్రేయస్‌ అయ్యర్‌(67) అర్ధశతకంతో రాణించడంతో భారత్‌ ఆ మాత్రం స్కోరైనా సాధించింది. అనంతరం జేసన్‌రాయ్‌(49), బట్లర్‌(28), మలన్‌(24*), బెయిర్‌స్టో(26*) బౌండరీలతో చెలరేగడంతో ఇంగ్లాండ్‌ సునాయాస విజయం సాధించింది. మరోవైపు టీమ్‌ఇండియా సారథి విరాట్‌ నెల రోజుల వ్యవధిలో మూడుసార్లు డకౌటయ్యాడు. చెన్నైలో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పరుగుల ఖాతా తెరవకముందే ఔటైన అతడు చివరి టెస్టులోనూ ఇలాగే ఔటయ్యాడు. తాజా మ్యాచ్‌లో మరోసారి డకౌటై అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాడు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని