ఆమె బయోపిక్‌లో నటించాలనుంది: వాణీ కపూర్‌ - vaani kapoor siad if i play in kalpana chawla biopic its be honour
close
Published : 07/08/2020 03:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆమె బయోపిక్‌లో నటించాలనుంది: వాణీ కపూర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: నటీనటులకు కెరీర్‌ పరంగా వారికంటూ కొన్ని ఆశలుంటాయి. పౌరాణిక పాత్ర చేయాలి.. విలన్‌ ఛాయలున్న పాత్రలు చేయాలి.. బయోపిక్స్‌లో నటించాలని కోరుకుంటారు. అలాగే బాలీవుడ్‌ నటి వాణీ కపూర్‌కి కూడా ఒకరి బయోపిక్‌లో నటించాలనే కోరిక ఉందట.

తొలి సినిమా ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌’తో వాణీ కపూర్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకుంది. బాలీవుడ్‌లో మూడు, కోలీవుడ్‌లో ఒకటి మొత్తం కలిపి చేసింది నాలుగు సినిమాలే అయినా సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు చిత్రాలున్నాయి. అయితే దివంగత వ్యోమగామి కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించాలని ఉందంటూ తాజాగా ఆమె తన కోరికను బయటపెట్టింది.

‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు, వ్యోమగామి కావాలనుకునే వారికి కల్పనా చావ్లా ఒక రోల్‌ మోడల్‌. ఆమె ఒక స్ఫూర్తిమంతమైన మహిళ. ఆమె జీవితాన్ని కచ్చితంగా చెప్పుకొవాల్సిన అవసరముంది. అందుకే వెండితెరపై ఆమె బయోపిక్‌లో నటించాలని చాలా ఆశపడుతున్నా. ఆమె బయోపిక్‌లో నటించగలిగితే నేను దానిని గౌరవంగా భావిస్తా’’ అని వాణీ కపూర్‌ చెప్పుకొచ్చింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని