టీకా పంపిణీ.. టాప్‌లో రాజస్థాన్‌ - vaccination in india wide
close
Published : 12/03/2021 23:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా పంపిణీ.. టాప్‌లో రాజస్థాన్‌

దిల్లీ: ఓ వైపు దేశంలో కరోనా ఉద్ధృతి పెరిగిపోతున్నా.. మరోవైపు కొవిడ్‌ వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా ముందుకెళ్తోంది. దీంతో వ్యాక్సిన్‌ పంపిణీలో భారత్‌ ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అత్యధికంగా రాజస్థాన్‌లో 25 లక్షలకు పైగా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేయగా.. తర్వాతి స్థానంలో మహారాష్ట్ర (24లక్షలు), గుజరాత్‌(21లక్షలు) ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లో 20 లక్షల మందికి పైగా టీకా తీసుకున్నట్లు అధికారులు వివరించారు. దేశంలో ఇప్పటివరకు 2 కోట్ల 61 లక్షల మందికి వ్యాక్సిన్‌ అందించారు. దీనిలో 2 కోట్ల 14 లక్షల మందికి తొలి డోస్‌ అందించగా, మరో 47 లక్షల మందికి రెండు డోసులు పూర్తి చేసినట్లు తెలిపింది.

మహా ఆందోళన..

దేశంలో నమోదవుతున్న కరోనా కొత్త కేసుల్లో అధికశాతం మహారాష్ట్రలో వస్తుండటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 14,317 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తంగా 22,66,374 కేసులు నమోదు కాగా, 1,06,070 క్రియాశీల కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు.  మహారాష్ట్రలో కరోనా విజృంభణపై కేంద్ర ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను పెంచి, ట్రాకింగ్‌ ద్వారా కొవిడ్‌ బాధితులను గుర్తించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో నమోదవుతున్న కొత్త కేసుల్లో రూపాంతరం(మ్యుటెంట్‌) చెందిన కరోనా వైరస్‌ బయటపడలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో సుమారు 80 వేల మందికిపైగా టీకా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని