vaccine:రాష్ట్రాలకు చేరిందెంత? పంపిణీ చేసిందెంత?  - vaccination status in india
close
Published : 17/05/2021 16:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

vaccine:రాష్ట్రాలకు చేరిందెంత? పంపిణీ చేసిందెంత? 

దిల్లీ: కరోనా వైరస్‌ నియంత్రణకు దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. కొవిడ్‌పై పోరాటంలో భాగంగా జనవరి 16నుంచి దేశ వ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా సోమవారం ఉదయం 7గంటల వరకు దేశవ్యాప్తంగా 18,29,26,460 డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు అందుబాటులో ఉండగా.. ఇప్పటివరకు 20 కోట్లకు పైగా డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఉచితంగా సమకూర్చింది. వీటిలో18.71కోట్ల టీకాలు (వేస్టేజీతో కలిపి) పంపిణీ జరిగిందని, ఇంకా 2కోట్ల డోసులకు పైగా వ్యాక్సిన్లు ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద పంపిణీకి సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. మరో మూడు రోజుల్లో అదనంగా దాదాపు 3లక్షల డోసులు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు అందనున్నట్టు తెలిపింది.

ఈ రోజు ఉదయం 7గంటల సమయానికి 14,11,47,770 మందికి తొలి డోసు వేయగా.. 4,17,78,690మందికి రెండో డోసు పూర్తయింది. మే 1 నుంచి మూడో దశ వ్యాక్సినేషన్‌ ప్రారంభం కాగా.. ఇప్పటివరకు 18 నుంచి 44 ఏళ్ల లోపు వయసు వారికి కేవలం 52,64,073మందికి మాత్రమే తొలి డోసు వేశారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని