టీకా తీసుకున్న 14రోజుల తర్వాతే..! - vaccine effectiveness to begin after 14 days
close
Published : 12/01/2021 21:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా తీసుకున్న 14రోజుల తర్వాతే..!

ఇమ్యూనిటీపై స్పష్టతనిచ్చిన కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ సన్నద్ధమవుతోన్న సమయంలో వ్యాక్సిన్‌ల పనితీరుపై కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టతనిచ్చింది. ఇప్పటివరకు అనుమతి పొందిన రెండు వ్యాక్సిన్‌లూ సురక్షితమైనవేనని పేర్కొన్న ఆరోగ్యశాఖ, రెండో డోసు తీసుకున్న 14రోజుల తర్వాతే దాని ప్రభావం ప్రారంభమవుతుందని స్పష్టంచేసింది. ప్రస్తుతం ఇవ్వనున్న కరోనా వ్యాక్సిన్‌ను 28రోజుల వ్యవధిలో రెండు డోసులను తీసుకోవాల్సి ఉంటుందని.. వ్యాక్సిన్‌ తీసుకున్న 14రోజుల తర్వాతే దాని ప్రభావం కనిపిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ వెల్లడించారు. అందుకే వ్యాక్సిన్‌ తీసుకున్న రెండు వారాల వరకూ కొవిడ్‌ నిబంధనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. ఇప్పటికే వేల మందిపై ప్రయోగాలు జరపగా ఇవి సురక్షితమని తేలిందని నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ స్పష్టంచేశారు. అయితే, వీటివల్ల వచ్చే దుష్ప్రభావాలు సర్వసాధారణమైనవే అని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా జనవరి 16 తేదీ నుంచి టీకా పంపిణీ మొదలుకానుంది. తొలిదశలో మూడు కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వీరిలో దాదాపు కోటి మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, మరో రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇవీ చదవండి..
రెండు టీకాలు సురక్షితమే..!
కొత్తరకంపై ‘కొవాగ్జిన్‌’ పనిచేస్తుంది..!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని