మహారాష్ట్రలో వ్యాక్సిన్ల కొరత.. - vaccine shortage in maharastra
close
Published : 07/04/2021 15:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్రలో వ్యాక్సిన్ల కొరత..

టీకా కేంద్రాల్ని మూసివేయాల్సి వస్తోందన్న ఆ రాష్ట్ర మంత్రి

ముంబయి : మహారాష్ట్రలో కొవిడ్‌ విజృంభణ తొలి దశ కంటే రెండో దశలోనే తీవ్రంగా ఉంది. దేశంలో తాజాగా నమోదవుతున్న కేసులు, మరణాల్లో.. సగం ఇక్కడి నుంచే నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా కట్టడి కోసం చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కూడా ఇక్కడ సజావుగా సాగడం లేదని తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ల కొరత నెలకొన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే తెలపడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత గురించి కేంద్రానికి తెలియజేశామని మంత్రి తెలిపారు.

‘రాష్ట్రంలో వ్యాక్సిన్లు మరో మూడు రోజులకు మాత్రమే సరిపోతాయి. మరిన్ని డోసులు పంపించాలని కేంద్రాన్ని కోరాం. రాష్ట్రంలో రోజురోజుకి నమోదవుతున్న కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముంబయిలో కూడా వ్యాక్సిన్లు తగినన్ని లేవు’ అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించినట్లు తోపే వెల్లడించారు.

‘చాలా టీకా కేంద్రాల్లో తగినన్ని డోసులు లేకపోవడంతో వాటిని మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యాక్సిన్లు లేకపోవడంతో అక్కడికి వచ్చిన ప్రజలను ఆరోగ్య సిబ్బంది తిప్పిపంపుతున్నారు’ అని కేంద్ర ఆరోగ్య మంత్రికి రాష్ట్రంలోని పరిస్థితిని ఆయన వివరించారు. కేంద్రం త్వరగా మరిన్ని టీకా డోసులు పంపించకపోతే.. అర్హులకు రెండో డోసు ఇవ్వడం కష్టతరంగా మారుతుందని ముంబయి నగర మేయర్‌ కిషోరి పెడ్నేకర్‌ చెప్పారు.

ఇక ఇప్పటివరకు కోటి 6లక్షల డోసులను కేంద్రం మహారాష్ట్రకు అందించింది. వాటిలో ఇప్పటికే 88లక్షల డోసులు పంపిణీ చేశారు. మరో 3శాతం డోసులు నిరుపయోగం కింద పోయాయని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. గత కొన్ని రోజులుగా ఇక్కడ రోజుకు నాలుగు లక్షల మందికిపైగా టీకాలు అందిస్తున్నారు. 

మరోవైపు మహారాష్ట్రలో మరోసారి భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా 55,469 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 297 మంది ప్రాణాలు వదిలారు. మొత్తంగా కరోనా బారిన పడినవారి సంఖ్య 31,13,354 మందికి చేరగా..56వేల పైచిలుకు మరణాలు సంభవించాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని