సౌతాఫ్రికా రకం.. టీకాపై ప్రభావమెంత? - vaccines may not work on south africas coronavirus strain
close
Published : 05/01/2021 22:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సౌతాఫ్రికా రకం.. టీకాపై ప్రభావమెంత?

లండన్‌: జన్యు మార్పిడితో వేషాన్ని మార్చుకున్న కరోనా మహమ్మారి బ్రిటన్‌, దక్షిణాఫ్రికాల్లో కొత్త అవతారం ఎత్తింది. ఈ రెండు రకాలు సాధారణ కరోనా కంటే త్వరితంగా వ్యాప్తించే లక్షణాన్ని కలిగి ఉన్నాయని వెల్లడైంది. అయితే.. దక్షిణాఫ్రికా రకంపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ పనిచేస్తుందా? అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా.. బ్రిటన్‌ రకం కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఆ టీకాలు పనిచేస్తాయని శాస్త్రజ్ఞులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ కొత్త దక్షిణాఫ్రికా రకం కరోనా గురించి తాము ఆందోళనకు గురవుతున్నట్లు బ్రిటన్‌ ఆరోగ్య మంత్రి మాట్‌ హాంకాక్‌ ప్రకటించారు. సౌతాఫ్రికా కొవిడ్‌పై ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు పనిచేస్తాయని కచ్చితంగా నిర్ధారణ కానందునే ఆయన ఈ విధంగా స్పందించారని.. బ్రిటిష్‌ ప్రభుత్వ శాస్త్రీయ సలహా బృంద సభ్యుడైన ఓ శాస్త్రవేత్త వెల్లడించారు.

ప్రస్తుతం బ్రిటన్‌ తదితర రకాల కంటే దక్షిణాఫ్రికా స్ట్రైన్‌ విభిన్నంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు. మానవ జీవకణాల్లో చొరబడేందుకు అతి ముఖ్యమైన స్పైక్‌ ప్రొటీన్‌కు సంబంధించి దీనిలో పలు పరివర్తనలు చోటుచేసుకోవటం ఆందోళనకరమని వారు వివరించారు. అంతేకాకుండా ఈ రకం త్వరగా వ్యాప్తి చెందే లక్షణాన్ని కూడా కలిగిఉందని వారు అంటున్నారు.

ఇదిలా ఉండగా దక్షిణాఫ్రికా రకం కొవిడ్‌ వైరస్‌పై కూడా పనిచేయగలిగిన వ్యాక్సిన్‌ను రూపొందించేందుకు మరీ ఎక్కువ కాలం పట్టదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నెల నుంచి ఆరు నెలల కాలంలోనే దీనిని నివారించగల వ్యాక్సిన్ తయారవుతుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి..

ఇంగ్లండులో మళ్లీ లాక్‌డౌన్‌

హెర్డ్‌ ఇమ్యూనిటీ వల్లే తీవ్రత తగ్గిందా..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని