నాగ్‌ నిర్మాతగా వైష్ణవ్‌ తేజ్‌ కొత్త చిత్రం? - vaishnav tej new film as nag producer
close
Updated : 19/02/2021 15:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాగ్‌ నిర్మాతగా వైష్ణవ్‌ తేజ్‌ కొత్త చిత్రం?

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఉప్పెన’. కృతి శెట్టి కథానాయిక. విజ‌య్ సేతుప‌తి కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న వైష్ణవ్‌తో అక్కినేని నాగార్జున ఓ సినిమా చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున నిర్మాతగా  ‘నిర్మలా కాన్వెంట్‌’, ‘ఉయ్యాల జంపాల’, ‘రంగుల రాట్నం’ వంటి చిత్రాలు రూపొందించారు. వైష్టవ్‌ తేజ్‌ నటించే ఈ చిత్రానికి నాగ్‌ ఓ నూతన దర్శకుడిని పరిచయం చేయనున్నాడట. వైష్ణవ్‌ ఇప్పటికే క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా (‘కొండపొలం’)లో నటించారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తున్న చిత్ర షూటింగ్‌ ఇప్పటికే పూర్తి చేసుకొంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని