వైష్ణవ్‌తేజ్‌ ‘ఉప్పెన’ టీజర్‌ వచ్చేసింది! - vaisshnav tej uppena teaser released
close
Updated : 13/01/2021 16:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైష్ణవ్‌తేజ్‌ ‘ఉప్పెన’ టీజర్‌ వచ్చేసింది!

హైదరాబాద్‌: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘ఉప్పెన’ టీజర్‌ వచ్చేసింది. వైష్ణవ్‌తేజ్‌ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. కృతిశెట్టి కథానాయిక. విజయ్‌ సేతుపతి కీలకపాత్ర పోషిస్తున్నారు. గతేడాది వేసవి కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

తాజాగా సంక్రాంతి పండగను పురస్కరించుకుని చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం ఆకట్టుకునేలా టీజర్‌ సాగింది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చిన ఇందులోని పాటలు ఇప్పటికే యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సుకుమార్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని