వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ చిత్రంలో అంజలి! - vakeel saab actress anjali signs f3
close
Published : 15/04/2021 14:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ చిత్రంలో అంజలి!

ఇంటర్నెట్‌ డెస్క్: వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్‌ 3’. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్‌2’కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. మరో విశేషం ఏమిటంటే ఇందులో ‘వకీల్‌సాబ్‌’ నటి అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారని వార్తలొస్తున్నాయి. వచ్చే వారంలోనే అంజలి ‘ఎఫ్‌3’ షూటింగ్‌లో పాల్గొననుందని చెప్పుకుంటున్నారు. అయితే అధికారికంగా ఎక్కడా ఈ విషయం బయటకు రాలేదు. ఇందులో హాస్యనటుడు సునీల్ కూడా ఓ పాత్ర పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా, సాయి శ్రీరామ్‌ కెమెరామన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని